
ఐసీసీసీ పనితీరుపై అధ్యయనం
వరంగల్ అర్బన్ : సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు వందశాతం అమలు చేస్తున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరాన్ని సోమవారం వరంగల్ బల్దియా పాలక వర్గం, అధికారుల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. స్టడీటూర్‌లో తొలి రోజు ఇండోర్‌లోని చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్, డంపింగ్ యార్డు, ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సిస్టం (ఐసీసీసీ) తీరును పరిశీలించారు. నగరంలోని ఆయా కాలనీల నుంచి ప్రతీ రోజు ఆరు రకాలుగా చెత్తను విభజించి సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 311 యాప్‌ద్వారా అందుతున్న వివిధ రకాల సేవలను వివరించారు. ఇందులో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎస్‌ఈ మహేందర్, సీపీ రవీందర్ రాడేకర్, కార్పొరేటర్లు, ఎంహెచ్‌ఓ రాజేశ్, హెచ్‌ఓ రమేశ్ తదితరులు ఉన్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్
బల్దియా పాలకవర్గం, అధికారుల స్టడీ టూర్‌పై ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజాధనంతో చేస్తోంది అధ్యయన యాత్రనా లేక ఆధ్యాత్మిక, విహార యాత్రనా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.