
వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
న్యూశాయంపేట: ప్రజాపాలన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ ఆజంజాహి మిల్లు మైదానంలోని కొత్త కలెక్టరేట్ పక్కన నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం ఉదయం పది గంటలకు హాజరై జాతీయ పతా కాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. సీటింగ్ ఏర్పాట్లు, షామియానా, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్‌రెడ్డి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
పత్తి కనీస మద్దతు ధర రూ.8,110
జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అన్నారు. కలెక్టరేట్‌లో పత్తి కొనుగోళ్లపై అధికారులు, ట్రేడర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తికి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 1,81,547 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు వివరించారు. 11,85,470 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. జిల్లాలోని నాలుగు వ్యవసాయ మార్కెట్లలో ఉన్న 27 జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో పత్తి కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా తూనికలు, కొలతల అధికారి మనోహర్ పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద