
మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
● ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్
గీసుకొండ: పోలీసులు సైబర్ నేరాల నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. గీసుకొండ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేసి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, గంజాయి, గుట్కా, గుడుంబా, జూదం లాంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దొంగతనాల కేసులను త్వరగా ఛేదించాలని, గ్రామ పోలీసు అధికారులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, గొడవలు సృష్టించే వారిౖపై నిఘా పెట్టాలన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(కేఎంటీపీ)లో పనిచేసే కార్మికులపై పర్యవేక్షణ ఉండాలని, అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నేరాల నివారణకు సాంకేతికతను ఉపయోగించాలని పేర్కొన్నారు. తొలుత డీసీపీకి సిబ్బంది గౌరవ వందనం చేయగా అనంతరం ఆయన పరేడ్‌ను స్వీకరించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పలు రికార్డులు పరిశీలించారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్వర్లు, గీసుకొండ సీఐ ఎ.మహేందర్, ఎస్‌ఐలు కుమార్, అనిల్, రోహిత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.