
నాగేంద్రస్వామికి పూజలు
గీసుకొండ: మండలంలోని ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దంపతులు మంగళవారం పూజలు చేసి మొక్కులు సమర్పించారు. వారికి అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీహర్ష ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మండల దీక్షలు చేపట్టిన స్వాముల కోసం అర్చకులు జ్యోతి పూజ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు రడం భరత్, శ్రావ్య దంపతులు స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు.
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
గీసుకొండ: వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డీపీఓ కటకం కల్పన అన్నారు. మండలంలోని శాయంపేటహవేలి గ్రామంలో ప్రత్యేక యాప్‌లో వివరాల నమోదును మంగళవారం పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. నర్సరీ, పల్లె ప్రకృతివననం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నిధులతో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్, కారోబార్ కనకాచారి పాల్గొన్నారు.
నేడు దసరా ఉత్సవాలపై సమీక్ష
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద నేతృత్వంలో సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలపై బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగపూరి సంజయ్‌బాబు, మేడిది మధుసూదన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వివిధశాఖల అధికారులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరుకావాలని వారు కోరారు.
కాల్వ ఒడ్డుపై మొసలి
ఖానాపురం: కాల్వ ఒడ్డుపై మొసలి చేరడంతో రైతులు మంగళవారం భయాందోళనకు గురయ్యారు. మండలంలోని బండమీదిమామిడితండా శివారు సంగెం కాల్వలో నుంచి ఒడ్డుపైకి చేరింది. దీంతో అటువైపు వెళ్లిన రైతులు మొసలిని చూసి భయపడ్డారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి మొసళ్లను పట్టుకుని పాకాల సరస్సులో వదిలేయాని రైతులు కోరుతున్నారు.

నాగేంద్రస్వామికి పూజలు

నాగేంద్రస్వామికి పూజలు