
రేపటి నుంచి మహిళా ఆరోగ్య కార్యక్రమాలు
గీసుకొండ: జిల్లాలో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ.. స్వశక్తి పరివార్ అభియాన్‌లో భాగంగా మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు జిల్లా ఇ మ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ ప్రకాశ్ అ న్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పరివార్ అభియాన్‌లో భాగంగా వైద్య అ ధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ ుతూ మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడానికి ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తామన్నారు. విద్యాలయాల్లో రక్తహీనత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రోగ్రాం అధికారులు ఆచార్య, విజయ్‌కుమార్, అనిల్‌కుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు.