
వినతులకు పరిష్కారం చూపాలి
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో ప్రజలనుంచి స్వీకరించిన వినతులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వినతులు స్వీకరించారు. మొత్తం 178 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. డీఆర్‌ఓ వై.వి గణేష్, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, జెడ్పీ సీఈఓ రవి, డీఈఓ వాసంతి, మెప్మా పీడీ జోనా తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి పోషణ మాసోత్సవం
ఈనెల 17వ తేదీ (బుధవారం) నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. పోషణ మాసం కార్యక్రమంలో అమలు చేసే వివరాలను డీడబ్ల్యూఓ జయంతి వివరించారు.
కొడుకులు ఆస్తి రాయించుకున్నారు
భర్త ద్వారా రావాల్సిన ఆస్తిని కొడుకులు నా పేరు మీదికి మా ర్చుతామని చెప్పి మోసం చేసి వాళ్ల పేరుతో మార్చుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ ఎవరూ లేరని సర్టిఫికెట్ తీసుకున్నారు. మోసం చేసి ఆస్తిని రాయించుకున్న ఐదుగురు కొడుకులపై చర్యలు తీసుకోవాలి.
– జుబేదా బేగం, పరకాల
ఇంట్లో నుంచి కొడుకు వెళ్లగొడుతున్నాడు
మాది హనుమకొండ హౌసింగ్ బోర్డ్ కాలనీ. నా రెండో కొడుకు, కోడలు అక్రమంగా ఇంట్లోకి వచ్చి నన్నే వేధించి వెళ్లగొడుతున్నారు. నా భర్త 40ఏళ్ల క్రితం చనిపోగా ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లను పెంచి పెద్ద చేసి ఒక ఇంటివారిని చేసిన. నా కొడుకు, కోడలు బయటికి గెంటేస్తే బతికే పరిస్థితి లేదు. వారిపై చర్యలు తీసుకోని, నా ఇంట్లో నేను ఉండే విధంగా చర్యలు తీసుకోండి.
– జేరిపోతుల రామసుందరమ్మ

వినతులకు పరిష్కారం చూపాలి

వినతులకు పరిష్కారం చూపాలి