
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
గీసుకొండ: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గీసుకొండ మండలం కొనాయమాకులలోని ఓ గార్డెన్‌లో గీసుకొండ, సంగెం మండలాల ఇందిరా మహిళా ప్రాథమిక సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాల వారికి ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతీ మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పమన్నారు. జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ రాంరెడ్డి, డీసీఓ నీరజ, పశుసంవర్ధకశాఖ జేడీ బాలకృష్ణ, అదనపు డీఆర్‌డీఓ రేణుకాదేవి, కాకతీయ కోఆపరేటివ్ సంస్థ ప్రిన్సిపాల్ యాకోబ్‌నాయక్, మండల సమాఖ్య అధ్యక్షురాలు రాధిక, సంగెం మండల అధ్యక్షురాలు ఉమాదేవి, అధికారులు పాల్గొన్నారు.