
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్‌సింగ్
దామెర: యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సరిపడా యూరియా ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రవీందర్‌సింగ్ అన్నారు. మండలంలోని ఊరుగొండ(పెద్దాపూర్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా పంపిణీని పరిశీలించారు. ఈసందర్భంగా రికార్డుల పరిశీలన అనంతరం మాట్లాడుతూ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట మండల వ్యవసాయ శాఖ అధికారులు అల్లె రాకేశ్, కమలాకర్, ఏఈఓలు జగదీశ్, రామకృష్ణ, అరుణ్, సీఈఓ శ్రీనివాస్ ఉన్నారు.
రైతులకు ఇబ్బంది కలుగొద్దు
శాయంపేట: యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ అధికారులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఫర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖలో చేపడుతున్న వివిధ పథకాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్.శ్రీనివాస్, టెక్నికల్ ఏఓ కమలాకర్, ఏఓ గంగాజమున, సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : ముల్కనూరు ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) విద్యార్థి గొల్లెన శ్రీనిధి కిక్ బాక్సింగ్‌లో రాష్ట్ర స్థాయిలో రాణించి గోల్డ్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ రెహమాన్ తెలిపారు. సోమవారం తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీలను వరంగల్‌లో నిర్వహించారు. అండర్–15 కేటగిరిలో నిర్వహించిన పోటీలో గోల్డ్ మెడల్ సాధించి, సౌత్ ఇండియా కిక్ బాక్సింగ్ లీగ్ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. శ్రీనిధిని ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు