
ప్రభుత్వాల వైఫల్యంతోనే యూరియా కొరత
● ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి రమేశ్
నర్సంపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే యూరియా కొరత ఉందని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక మతోన్మాద పాలకుల పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్‌లో సోమవారం సింగతి మల్లికార్జున్ అధ్యక్షతన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యలపై గ్రామాల్లో సర్వేలు నిర్వహించి పరిష్కరించే విధంగా పోరాటాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. డివిజన్ పార్టీ పూర్వ వైభవానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి డివిజన్ కమిటీ సభ్యుడు ముందుకు కదలి పని చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుసుంబ బాబురావు, వంగల రాగసుధ, కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహ్మద్ రాజాసాహెబ్, గటికె జమున, తడుక కౌసల్య, గీసపాక కొమురయ్య, దామ సాంబయ్య, కలకోట్ల యాదగిరి, గాజుల వెంకటయ్య, అల్లి సాహెబ్, కర్నె సాంబయ్య, బత్తిని కుమారస్వామి, బడిమె సురేందర్, సీతారాములు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.