
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 166 ఫిర్యాదులు వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా బిల్లులు రావట్లేదని, రెండు నెలల నుంచి తిరుగుతున్నా టెక్నికల్ సమస్య ఉందని చెబుతున్నారని 41వ డివిజన్‌కు చెందిన అందె ఝాన్సీ వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఆర్‌డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.