
చెరువులు.. నిండుకుండలు
నర్సంపేట: ధాన్యాగార కేంద్రంగా పేరొందిన వరంగల్ జిల్లాలో దాదాపు అన్ని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఈసీజన్‌లో రుతుపవనాలు ఆలస్యమైనప్పటికీ గత నెలలో కురిసిన భారీ వర్షాలకు చాలాచెరువులు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో ప్రధాన చెరువు పాకాలతోపాటు కుంటలు, పెద్ద చెరువులు మత్తళ్లు పోస్తుండగా 294 చెరువులు వంద శాతం నిండాయి. జిల్లాలో 816చెరువులు ఉండగా అన్ని చెరువుల్లో జలకళ నెలకొంది. జిల్లాలో ఈ సీజన్‌లో 3 లక్షల పైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తుండగా.. ఖరీఫ్ పంటలతోపాటు రబీ సీజల్‌లో సాగు చేసే పంటలకు సైతం సాగునీరు అందనుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాకాల పరవళ్లు
జిల్లాలో సాగు నీటిపరంగా పాకాల సరస్సుకు ప్రాధాన్యం ఉంది. మూడు టీఎంసీల కెపాసిటీ కలిగిన పాకాల సరస్సు 30 ఫీట్లకు చేరుకొని 15రోజులుగా మత్తడి పోస్తోంది. జిల్లాలో వరి పంట లక్షా 27వేల 950ఎకరాల విస్తీర్ణంలో సాగు అవుతుండగా పాకాల సరస్సు కింద అధికారికంగా 30వేల ఎకరాలతోపాటు అనధికారికంగా మరో 20వేల ఎకరాలు సాగు అవుతోంది.
మత్తడి పోస్తున్న పాకాల సరస్సు
జిల్లాలో జలకళ సంతరించుకున్న చెరువుల వివరాలు..
మండలం చెరువులు 0–25% 25–50 50–75 75–100 మత్తళ్లు
గీసుగొండ 76 0 0 0 74 2
సంగెం 73 0 0 23 48 2
పర్వతగిరి 64 0 0 0 38 26
వర్ధన్నపేట 68 0 7 15 26 20
ఖిలా వరంగల్ 48 0 0 0 03 45
రాయపర్తి 96 0 3 42 51 0
దుగ్గొండి 71 0 0 9 52 10
నల్లబెల్లి 82 0 0 0 56 26
నర్సంపేట 70 0 0 0 50 26
ఖానాపురం 23 0 0 0 23 0
నెక్కొండ 80 0 0 11 20 49
చెన్నారావుపేట 45 0 0 0 25 20
వరంగల్ 20 3 0 0 11 6
జలకళ సంతరించుకున్న జలాశయాలు
జిల్లాలో 816 చెరువులు
రెండు పంటలకు ఢోకా లేదంటున్న అన్నదాతలు