
నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యం
● ఎస్‌ఈ గౌతమ్‌రెడ్డి
సంగెం: ప్రజలకు నిరంతర విద్యుత్ అందించే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తోందని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ వరంగల్ ఎస్‌ఈ గౌతమ్‌రెడ్డి అన్నారు. నల్లబెల్లి 33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో నూతనంగా 11 కేవీ నార్లవాయి ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరాను ప్రారంభించిన సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. టెక్నికల్ డీఈ ఆనంద్ మాట్లాడుతూ.. ఫీల్డ్ సిబ్బంది తప్పనిసరిగా ఎర్త్ రీచార్జి రాడ్, సేఫ్టీ బెల్ట్, హెల్మెట్ ధరించి సేవలు అందించాలన్నారు. సోలార్ విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాపులకనపర్తి ఏడీఈ రవికుమార్, సంగెం సెక్షన్ ఏఈ మధుసూదన్, సబ్ ఇంజనీర్ రాజేశ్‌కుమార్, ఎల్‌ఈ చంద్రమౌళి, ఎల్‌ఐ పాషా, ఎల్‌ఎం బాబూరావు, ఏఎల్‌ఎంలు రాజ్‌కుమార్, కాశీరాం, శ్రీను, కాంట్రాక్టర్ సంపత్‌రావు, ఆన్‌మెన్స్ కొంరెల్లి, సుదన్, సుమన్, భాస్కర్, సురేశ్, ఆపరేటర్లు భిక్షపతి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.