మురికి కూపం | - | Sakshi
Sakshi News home page

మురికి కూపం

Aug 4 2025 3:08 AM | Updated on Aug 4 2025 3:08 AM

మురిక

మురికి కూపం

సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025

8లోu

నర్సంపేట: గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఆవిర్భవించిన నర్సంపేట సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో రోజుల తరబడి నీరు నిలిచి ప్రజలు సీజనల్‌ వ్యాధులబారిన పడుతున్నారు. దోమల కారణంగా ఆస్పత్రులకు రోజురోజుకు జ్వరపీడితులు వరుస కడుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాల్సిన మున్సిపల్‌ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు.

పైపులైన్ల లీకేజీ.. తాగునీరు కలుషితం

నర్సంపేట పట్టణంలోని 30 వార్డుల్లో 60 వేల జనాభా ఉంది. మున్సిపాలిటీలోని చాలా ప్రాంతాల్లో పైపులైన్ల లీకేజీతో తాగునీరు కలుషితం అవుతోంది. వర్షాకాలంలో ప్రజలు జ్వరాలబారిన పడడానికి తాగునీటి కలుషితం కావడం కూడా ఒక ప్రధాన కారణం. నీళ్ల ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉన్నా అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

అమలుకు నోచుకోని ప్రణాళిక..

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు అధికారులు రూపొందించిన ప్రణాళిక అమలుకు నోచుకోవడం లేదు. కొత్తగా ఏర్పడిన కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. చాలా కాలనీల్లో మురుగు నీరు వెళ్లడానికి కాల్వలు నిర్మించలేదు. దీంతో వర్షపు నీరు నిలవడంతోపాటు పిచ్చిమొక్కలు ఉండి దోమలు వృద్ధి చెందుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా కాలనీల్లో చెత్త సేకరణ కూడా రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి చేస్తున్నారు.

నివారణ చర్యలు ఇలా..

● కాలనీల్లో చాలా ప్రాంతాల్లో మురుగునీరు బయటకు వెళ్లే అవకాశం లేదు. అవసరం ఉన్న ప్రాంతాల్లో మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలి.

● దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రెయినేజీలు శిథిలం కావడంతో నీరు నిలుస్తోంది. మరో వైపు పెరిగిన జనాభాకు అనుగుణంగా నూతనంగా డ్రెయినేజీలు విస్తరించాలి.

● మున్సిపాలిటీలో రోడ్ల ఆక్రమణ కారణంగా కొన్ని ప్రదేశాల్లో డ్రెయినేజీల్లో పూడిక నిండుతోంది. దుకాణా సముదాయాలు ఉన్న చోట్ల కాల్వలపై మీటర్ల దూరం వరకు సిమెంట్‌ స్లాబు వేయడంతో పూడిక నిండి ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటి చోట పూడిక తీసేందుకు ఏర్పాట్లు చేయాలి.

● కాలనీల్లోని ఖాళీ స్థలాలు దోమలకు ఆవాసాలుగా మారాయి. వీటిలో పిచ్చిమొక్కలు, మురుగునీరు ఉంటోంది. వాటి యజమానులకు నోటీసులు ఇచ్చి వదిలి వేయడం కాకుండా పరిశుభ్రంగా ఉండేలా మున్సిపల్‌ అధికారులు దృష్టి సారించాలి.

● వర్షాకాలంలో ట్యాంకులు, బావులు, బోర్లను క్లోరినేషన్‌ చేయాలి. తాగునీటి పైపులైన్లు పగిలి తాగునీరు కలుషితం అవుతున్న ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలి.

కమిషనర్‌ చర్యలతో ఉపశమనం..

కొన్ని సంవత్సరాలుగా నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు పలు సమస్యలకు దారితీశాయి. ఇటీవల బాధ్యతలు తీసుకున్న కమిషనర్‌ భాస్కర్‌ రాజకీయాలకు అతీతంగా ఆక్రమణలను తొలగించడంతో పట్టణ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

నర్సంపేట మున్సిపాలిటీలో

అపరిశుభ్రత

పట్టణంలో నామమాత్రంగా

పారిశుద్ధ్య పనులు

రోడ్లపైనే పేరుకుపోతున్న

చెత్త, మురుగునీరు

వ్యాధులబారిన పడుతున్న

కాలనీల ప్రజలు

ఈ ఫొటోలో కనిపిస్తున్నది నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డులో ఉన్న ఖాళీ స్థలం. నాలుగు సంవత్సరాలుగా పట్టణంలోని పలు కాలనీలకు చెందిన మురుగునీరు ఇందులో నిల్వ ఉంటోంది. ఇటీవల మున్సిపల్‌ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయగా.. మురుగునీరు, వ్యర్థాలు పోవడానికి కాల్వలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నీరు అలాగే నిల్వ ఉండి దోమలు వృద్ధి చెంది ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు.

డ్రెయినేజీని శుభ్రం చేయాలి..

నర్సంపేట పట్టణంలో డ్రెయినేజీని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున రోడ్ల వెంట ఉండే చెత్తను వెంటవెంటనే తొలగించాలి. పట్టణంలో ఫాగింగ్‌ చేపట్టి దోమల నివారణకు చర్యలు చేపట్టాలి.

– బైకని రాజ్‌కుమార్‌, నర్సంపేట

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం..

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్యాచరణ మొదలు పెట్టాం. ఇందులో భాగంగానే పట్టణంలోని ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టాం. ఖాళీ ప్లాట్ల యజమానులను గుర్తించాం. ఖాళీ ప్లాట్లలో నీరు నిల్వకుండా ఉండేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నాం.

– భాస్కర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, నర్సంపేట

మురికి కూపం1
1/6

మురికి కూపం

మురికి కూపం2
2/6

మురికి కూపం

మురికి కూపం3
3/6

మురికి కూపం

మురికి కూపం4
4/6

మురికి కూపం

మురికి కూపం5
5/6

మురికి కూపం

మురికి కూపం6
6/6

మురికి కూపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement