
సెర్ప్ ఉద్యోగుల సేవలు అభినందనీయం
గీసుకొండ: మహిళా సంఘాల ఉన్నతికి సీసీ గడ్డి అశోక్, ఏపీఎం సురేశ్‌కుమార్ చేసిన సేవలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చాయని సెర్ప్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. గడ్డి అశోక్ ఉద్యోగ వి రమణ, ఏపీఎం సురేశ్‌కుమార్ ఐనవోలు మండలా నికి బదిలీ అయిన సందర్భంగా ఆదివారం కొనా యమాకులలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన పనితీరుతో లక్ష్యాలను చేరుకోవడానికి ఉద్యోగులు కృషి చేయాలని ఆకాంక్షించారు. సీసీల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు న ర్సయ్య, జిల్లా అధ్యక్షుడు గోలి కొమురయ్య, మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు ర డం భరత్, మండల సమాఖ్య అధ్యక్షురాలు గట్టు రాధిక, సెర్ప్ సీసీ శోభారాణి, సుజాత, శ్రీకాంత్, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. అంతకు ముందు మండల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు అశోక్, సురేశ్‌కమార్‌ను సన్మానించారు.
సెర్ప్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్