
ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తి చేయండి
పరకాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్ని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్, పరకాల మున్సిపల్ ప్రత్యేక అధికారి ఎ.వెంకట్‌రెడ్డి.. మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులతో పాటు పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ పనుల్లో నిబంధనలు వివరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ కె.నారాయణ, మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ, మున్సిపల్ ఏఈ రంజిత్, వార్డు అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు వేగంగా పరిష్కరించండి..
నడికూడ: భూ భారతి రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తుల్ని వేగంగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, మే నెలలో భూ భారతి రెవెన్యూ సదస్సులో స్వీకరించిన భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల పురోగతిని సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాణి, డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి