
పులి జాతిని కాపాడుకోవాలి
ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్
న్యూశాయంపేట: అంతరించి పోతున్న పులిజాతిని కాపాడుకోవాలని హనుమకొండ ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్ అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం(ఇంటర్ నేషనల్ టైగర్స్ డే) సందర్భంగా హనుమకొండ హంటర్‌రోడ్‌లోని కాకతీయ జూలాజికల్ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెద్దపులి నివాసం ఉన్న చోట అడవులు పచ్చదనాన్ని సంతరించుకుని దట్టంగా ఉంటాయన్నారు. అనంతరం ప్రతిభా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డీఎఫ్‌ఓ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. పార్కులో ఏర్పాటు చేసిన సేవ్‌టైగర్స్–సేవ్ నేచర్ పెద్దపులుల ఛాయాచిత్ర ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ కృష్ణమాచారి, ఎఫ్‌ఆర్‌ఓ మయూరి, డాక్టర్ ఆచార్య రవికుమార్, పి.వెంకటేశ్వర్‌రావు, నాగేశ్వర్‌రావు, పి.రవిబాబు, ఎం.సునీల్ పాల్గొన్నారు.