
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
పరకాల: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్నేహ శబరీశ్ హెచ్చరించారు. పరకాల పట్టణంలోని పీఎసీఎస్ గోదాంలతోపాటు పలు ఎరువుల దుకాణాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పరకాల మండలంలో 170 టన్నుల యురియా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా ఎరువుల దుకాణాల స్టాక్‌బోర్డులతోపాటు ధరల పట్టికలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు కావాల్సిన ఎరువులను ఇవ్వాలే తప్ప లింక్‌లు పెట్టి అమ్మకూడదని స్పష్టం చేశారు. తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీశ్