
ఉప్పల్ ఆర్వోబీని త్వరగా పూర్తిచేయాలి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
కమలాపూర్: ఉప్పల్ రైల్వే గేట్‌పై నిర్మిస్తున్న ఆర్వోబీని త్వరితగతిన పూర్తిచేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కోరారు. ఆర్వోబీ పనులను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఉప్పల్ ఆర్వోబీ కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. వచ్చే ఏడాది మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు ఈ మార్గం నుంచే రాకపోకలు సాగిస్తారని, ఆర్వోబీని వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ సత్యనారాయణరావు, బీఆర్‌ఎస్ నాయకులు రాజు, నవీన్‌కుమార్, దేవేందర్‌రావు, రాంచందర్, రాజమౌళి, హసనోద్దీన్, ఉపేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నిరసన ఫలితమే ఆర్వోబీ పనులు..
కాంగ్రెస్ పార్టీ నిరసన ఫలితంగానే ఆర్వోబీ పనులు వేగవంతమయ్యాయని ఏఎంసీ చైర్‌పర్సన్ తౌటం ఝాన్సీరవీందర్ అన్నారు. ఆర్వోబీ పనులను మంగళవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఆరేళ్లుగా ఆర్వోబీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, పనుల జాప్యంపై ఇటీవల కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను నిలదీశామని, దీంతో ఆర్వోబీ పనులు ప్రారంభించారన్నారు. ఆర్వోబీ పనులు నెలరోజుల్లో పూర్తవుతాయని రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ చెప్పారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు కృష్ణ, భిక్షపతి, లింగయ్య, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, రమేశ్, వంశీ, మొగిలయ్య, కనకరత్నం, రమేష్, రాజ్‌కుమార్, ఇస్తారి, చంద్రమౌళి, కుమార్, రమేశ్, తేజ పాల్గొన్నారు.