
పల్లెదవాఖానా వైద్యుడిపై కలెక్టర్ ఆగ్రహం
సంగెం: మండలంలోని కాపులకనిపర్తి పల్లె దవాఖానా వైద్యుడు రాకేష్‌పై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకనిపర్తి పల్లెదవాఖానను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. డాక్టర్ రాకేష్, ఏఎన్‌ఎంలు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సయానికి దవాఖానాకు రాకపోవడంపై డీఎంహెచ్‌ఓకు సమాచారం ఇవ్వడంతో ఆయన హుటాహుటిన వచ్చారు. ఆస్పత్రిలోని మందులను కలెక్టర్ పరిశీలించారు. గడువు ముగిసినవి ఉండడంతో మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ రాకేష్‌పై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావును ఆదేశించారు. అనంతరం మండలంలోని గవిచర్లలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ రవి, ఎంఈఓ రత్నమాల, ఆర్‌ఐ నరేందర్, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, కేఎంటీపీ జోనల్ మేనేజర్ స్వామి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, కుడా పీఓ అజిత్‌రెడ్డి, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ కొమురయ్య, పంచాయతీ కార్యదర్శి శరత్ ఉన్నారు.