
భోజనం బాగుందా..
దుగ్గొండి: భోజనం బాగుందా.. మెనూ పాటిస్తున్నారా.. కూరలు రుచిగానే ఉంటున్నాయా.. అని అదనపు కలెక్టర్ సంధ్యారాణి.. విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని గిర్నిబావి మహా త్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాన్ని ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని చెప్పారు. శుభ్రత పాటించకపోతే విద్యార్థులు అనారోగ్యం భారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజ నం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. రోజువారీ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. అనే వివరాలను అడిగారు. భోజనం రుచిగానే ఉందని విద్యార్థులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కష్టపడి చదువుకుని ఉన్నతస్థానంలో ఉండాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య, ఏటీపీ సతీష్, డిప్యూటీ వార్డెన్ సమత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆన్‌లైన్ పూర్తి చేయాలి
దుగ్గొండి: భూ భారతి కార్యక్రమంలో భాగంగా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ ఆగస్టు 10లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. భూ భారతి ఆన్‌లైన్ ప్రక్రియపై తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. మండంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్ని ఆన్‌లైన్ చేశారని అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్ చేయడంలో ఆలసత్వం వీడాలని మందలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, డీటీ ఉమారాణి, ఆర్‌ఐ రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
పూలే విద్యాలయాన్ని తనిఖీ చేసిన
అదనపు కలెక్టర్ సంధ్యారాణి