
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
నెక్కొండ: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నెక్కొండ మండలంలో మోడల్ స్కూల్, నెక్కొండ, అప్పల్‌రావుపేట, పత్తిపాక, అ లంకానిపేట, పెద్దకొర్పోలు, రాముల తండా పాఠశాలలో మంగళవారం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ ఇప్పటి వరకు అమలు నోచుకోలేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్‌తో వెంటనే అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రిలీజ్ చేయాలని, జీపీఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్, టీజీజీఎల్‌ఐ ఫైనల్ పేమెంట్స్, సరెండర్ లీవ్స్ తదితర బిల్లులు అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు సీపీఎస్ రద్ద చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని చెప్పారు. సభ్యత్వ నమోదులో వేగం పెంచి, రి కార్డు స్థాయిలో నమోదు చేయాలని సంఘం నాయకులకు సూచించారు. సమావేశంలో ఆ సంఘం జి ల్లా ప్రధాన కార్యదర్శి నకిరెడ్డి మహేందర్‌రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాలోతు ప్రతా ప్‌సింగ్, కర్ర యాకుబ్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, రవీంద్రనాథ్, సంఘం బాధ్యులు గుగులోతు యాకు, ఐలయ్య, ఈర్యా, భిక్షపతి, రామకృష్ణ, ప్రవీణ్, రాజేందర్, రమేశ్ పాల్గొన్నారు.
పీఆర్టీయూటీఎస్
జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి