
రైతులు భూగర్భజలాలను పెంపొందించుకోవాలి
రాయపర్తి : ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టి నిల్వచేసి భూగర్భజలాలు పెంపొందించుకోవాలని డీఆర్డీఓ కౌసల్యాదేవి సూచించారు. మండలంలో బురాన్‌పల్లి, కాట్రపల్లి, కొండూరు గ్రామాల్లో ఈజీఎస్ పథకంలో భాగంగా చేపట్టిన పండ్ల తోట లు, పశువుల పాకలు, ప్లాంటేషన్, పామ్ పాండ్స్, చెక్ డ్యామ్ నిర్మాణాలను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ భూముల్లో రైతులు ప్రయోజనాలు పొందేలా నిర్దేశిత పనులు చేసుకొని పథకం లక్ష్యసాధనకు తోడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కిషన్, ఎంపీఓ ప్రకాశ్, ప్లాంటేషన్ మేనేజర్ రమేష్, ఈజీఎస్ ఈసీ ప్రవీణ్, టీఏలు కిషన్ రెడ్డి, సందీప్ తదతరులు
పింఛన్ పంపిణీ ప్రక్రియ పరిశీలన
వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పోస్టాఫీస్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేస్తున్న పింఛన్ పంపిణీ ప్రక్రియను డీఆర్‌డీఓ కౌసల్యదేవి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫేస్ రికగ్నైజేషన్ పంపిణీ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరమణ, ఏపీఎం వేణు, సీసీ గోలి కొమురయ్య, పంచాయతీ కార్యదర్శులు రామారావు, జీపీ సిబ్బంది, లబ్ధిదారులు ఉన్నారు.
డీఆర్డీఓ కౌసల్యాదేవి