హన్మకొండ అర్బన్ : సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు చేపట్టిన నిరవధిక సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సంఘం జిల్లా నాయకుడు గౌరీశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రేషన్‌షాపులు బంద్ పాటిస్తామని పేర్కొన్నారు. చాలీచాలని కమీషన్లతో తమ బతుకులు అధ్వానంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోపు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి రేషన్ డీలర్ సమ్మెలో పాల్గొంటాడని పేర్కొన్నారు.


