వరంగల్: కేంద్ర ఎన్నికల సంఘం అదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ సమ్మర్ రివిజన్–2023(ఎస్‌ఎస్‌ఆర్)లో ఓటర్ల పూర్తి సమాచారం సేకరించాలని వరంగల్ ఈఆర్‌ఓ, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. శుక్రవారం ఐఎంఎ హాల్‌లో వరంగల్, ఖిలావరంగల్ తహసీల్దార్లు సత్యపాల్‌రెడ్డి, ఫణికుమార్‌లతో కలిసి ఎస్‌ఎస్‌ఆర్–2023పై సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఓటర్ ఇంటికి వెళ్లి వారి సంక్షిప్త సమాచారం సేకరించాలన్నారు. ఈ కార్యక్రమం మే 21నుంచి జూన్ 23 వరకు జరుగుతుందని తెలిపారు. ఓటరు నమోదులో సవరణలుంటే సేకరించాలని తెలిపారు. అక్టోబర్ వరకు 18ఏళ్ల వయస్సు నిండే వారు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అర్హులని తెలిపారు.


