జాతీయ జెండాకు నమస్కరిస్తున్న కొండేటి శ్రీధర్
గీసుకొండ: ఎంతో మంది యువత, విద్యార్థుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ కుటుంబ పాలనలో బందీ అయ్యిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతీ బీజేపీ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిశంకర్, గుడిపెల్లి రాజేశ్వర్‌రావు, జిల్లా నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుసుమ సతీశ్, గంట రవికుమార్, వన్నాల వెంకటరమణ, రాదారపు శివకుమార్, గట్టికొప్పుల రాంబాబు, జి.అశ్విని, ప్రసాద్, కె.మహేశ్, టి.వెంకట్ ఉన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్


