
మాట్లాడుతున్న ఎన్‌డీడీబీ చైర్మన్ మీనేష్ షా
ఎన్‌డీడీబీ చైర్మన్ మీనేష్ షా
ఎల్కతుర్తి: పశుగ్రాసానికి పాడి రైతులు నాణ్యమైన గడ్డి విత్తనాలను వాడాలని ఎన్‌డీడీబీ (జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ) చైర్మన్ మీనేష్ షా సూచించారు. బుధవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కోఆపరేటివ్ డెయిరీని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విత్తనాల ద్వారా లభించే గ్రాసం తిన్న పాడిపశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుందని సూచించారు. నాసిరకం గడ్డి విత్తనాలతో పాల ఉత్పత్తి తగ్గడంతోపాటు పశువులకు పలు రోగాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ముల్కనూర్ డెయిరీకి మార్కెటింగ్ కోసం రూ.1.03లక్షల ప్రాజెక్టును ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో రూ.57.15లక్షలు సబ్సిడీ వస్తుందని చెప్పారు. సమావేశంలో ఎన్‌డీడీబీ ప్రాంతీయ అధికారి రాజీవ్, స్టేట్ ఇన్‌చార్జ్ మహేష్‌కుమార్, డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.