● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
ఖిల్లాఘనపురం: గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఇన్‌చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్‌రెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని మల్క్‌మియాన్‌పల్లిలో వైకుంఠధామం, నర్సరీ, ఉపాధి పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో మొక్కలు ఎండిపోవడానికి అవకాశం ఉందని, నిత్యం నీరు అందించడంతో పాటు వర్షాకాలంలో నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. బెడ్ల నడుమ కలుపు తొలగించాలని, మొక్కలు పెరిగేందుకు అవసరమైన ఎరువులు అందించాలని సూచించారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు నీడ, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కూలీలకు సకాలంలో కూలి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన వెంట సర్పంచ్ రామకృష్ణ, ఉప సర్పంచ్ చెన్నయ్య, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ సునీత, ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ టీఎస్ ఆవిర్భావ వేడుకలు
వనపర్తిటౌన్: పీఆర్‌టీయూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లాకేంద్రంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార పోరాటంలో సంఘం ఎన్నడూ వెనకడుగు వేయలేదని, నిజాయితీగా పని చేస్తోందన్నారు. మలిదశ తెలంగాణా ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాటి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొనకుండా అడ్డుకొని చీలిక తేవడంతో 2011, ఏప్రిల్ 9న పీఆర్‌టీయూ టీఎస్ అనే ఉపాధ్యాయ సంఘాన్ని గాల్‌రెడ్డి హర్షవర్షన్‌రెడ్డి స్థాపించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాయినిపల్లి శ్రీనివాసులు, ప్రతినిధులు, ఉపాధ్యాయులు కరుణాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నారాయణరావు, రామచంద్రయ్య, నర్సింహ, జైపాల్‌రెడ్డి, ఆంజనేయులు, విజయ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్, బాలస్వామి, విష్ణువర్ధన్, రమేష్, స్వామి పాల్గొన్నారు.


