వనపర్తి రూరల్: నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అంకూర్‌లో ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని యజమానులు భాగ్యలక్ష్మి– బీష్ముడు, కొండమీది శారద –శేఖర్‌రెడ్డి, కావేరి–వెంకటేశ్వరెడ్డి, నిర్మల–శేఖర్‌రెడ్డి, మాధవి–ముత్యాలు దంపతులకు నూతన పట్టు వస్త్రాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని అధికారంలోకి వచ్చి మోసం చేసిందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. తమ కల సహకారం చేసిన ప్రభుత్వ పెద్దలు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పోతుల కళావతి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


