వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాలి

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

కొత్తకోట రూరల్‌: పుర పారిశుద్ధ్య సిబ్బంది వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన పుర పరిధిలో పర్యటించి నర్సరీలు, సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాలను పరిశీలించారు. జూన్‌ నెలలో మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని.. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేయాలని సూచించారు. ఆయన వెంట పుర కమిషనర్‌ సైదయ్య, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement