నేడు ఎస్‌ఎల్‌బీసీకి సీఎం రేవంత్‌రెడ్డి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు ఎస్‌ఎల్‌బీసీకి సీఎం రేవంత్‌రెడ్డి రాక

Nov 3 2025 6:54 AM | Updated on Nov 3 2025 6:54 AM

నేడు

నేడు ఎస్‌ఎల్‌బీసీకి సీఎం రేవంత్‌రెడ్డి రాక

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌ అవుట్‌ లెట్‌ టన్నెల్‌ను సందర్శించనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను కొనసాగించేందుకు హెలీకాప్టర్‌ ద్వారా ఏరియల్‌ ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ సర్వేను ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ అవుట్‌ లెట్‌కు చేరుకొని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి హెలీకాప్టర్‌ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ సర్వేను పరిశీలిస్తారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకాల్లో భాగంగా గత ఫిబ్రవరి 22న దోమలపెంట ఇన్‌లెట్‌ వద్ద సొరంగం కుంగి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీబీఎం ద్వారా టన్నెల్‌ తవ్వకాలకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఏరియల్‌ ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ సర్వే చేపట్టి టన్నెల్‌ మార్గంలో సుమారు వెయ్యి మీటర్ల వరకు లోతు వరకు ఉన్న షీర్‌జోన్‌, జియోఫిజికల్‌ పరిస్థితులను అంచనా వేయనున్నారు. ఆ తర్వాత టన్నెల్‌ తవ్వకాలపై నిర్ణ యం తీసుకుంటారు. నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్జీఆర్‌ఐ) నిపుణుల ఆధ్వర్యంలో ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు.

నేడు విద్యుత్‌ వినియోగదారుల దినోత్సవం

వనపర్తిటౌన్‌: విద్యుత్‌ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రంలోని విద్యుత్‌ డివిజినల్‌ కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహిస్తున్నట్లు డీఈ శ్రీనివాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బిల్లింగ్‌, సరఫరాలో అంతరాయం, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల ఏర్పాటు తదితర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని గృహ, వ్యాపార, పరిశ్రమ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులు ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రామన్‌పాడులో

పూర్తిస్థాయి నీటిమట్టం

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికి పైన 1,0 21 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 832 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటిని నిలిపివేశారని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్‌ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూ సెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.

దిగువకు పారుతున్న వరద

వనపర్తి రూరల్‌: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగ సముద్రం రిజర్వాయర్‌కు వరద కొనసాగుతుండటంతో ఆదివారం కూడా ఒక షట్టర్‌ తెరిచి నీటిని దిగువకు వదిలినట్లు ఏఈ వినయ్‌ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి

కొత్తకోట రూరల్‌: అధిక దిగుబడులకు నాణ్యమైన విత్తనాలు అవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు తెలిపారు. పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో ఎఫ్‌పీఓ (ఫార్మర్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్గనైజేషన్‌) ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ మన్నెపురెడ్డి సాగుచేసిన వరి పంటను, ధాన్యాన్ని పశ్చిమబెంగాల్‌ వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ.. డీఆర్‌ఆర్‌–75 వరి విత్తనం సాగు చేయడంతో ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. దీంతో జిల్లాలోని వివిధ గ్రామాల రైతులు తరలివచ్చి పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రైతులకు విత్తనం అవసరం ఉంటే సెల్‌నంబర్‌ 99081 61633 సంప్రదించాలని సూచించారు.

నేడు ఎస్‌ఎల్‌బీసీకి  సీఎం రేవంత్‌రెడ్డి రాక 
1
1/2

నేడు ఎస్‌ఎల్‌బీసీకి సీఎం రేవంత్‌రెడ్డి రాక

నేడు ఎస్‌ఎల్‌బీసీకి  సీఎం రేవంత్‌రెడ్డి రాక 
2
2/2

నేడు ఎస్‌ఎల్‌బీసీకి సీఎం రేవంత్‌రెడ్డి రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement