అమరుల ఆశయ సాధనకు పనిచేద్దాం
వీపనగండ్ల: పేద ప్రజల బాగు కోసం అహర్నిశలు పనిచేసి మరణించిన అమరుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కోరారు. ఉపసర్పంచ్, సీపీఎం సీనియర్ నాయకుడు పెద్ద రాములు ఇటీవల మృతిచెందగా.. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన సంస్మరణ సభకు హాజరై మాట్లాడారు. పేదరికంలో ఉన్న పలువురికి కామ్రేడ్ పెద్ద రాములు అండగా నిలిచారని కొనియాడారు. భూ స్వాములు, నక్సలైట్లు దాడి చేసి గాయపర్చినా పార్టీ కోసం పని చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి గోపాల్, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు ఎండీ జబ్బార్, యూటీఎఫ్ జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు రవిప్రసాద్‌గౌడ్, కృష్ణయ్య, మండల కార్యదర్శి బాల్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బాబి, మహబూబ్‌పాషా, జితేందర్‌గౌడ్, ఆశన్న, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
