ఖర్చులు పెరిగాయి..
ఈసారి వరి సాగు ఖర్చులు అధికంగా పెరిగాయి. యూరియా కోసం రోజుల తరబడి వేచి ఉండటం.. సకాలంలో అందక ఆశించినస్థాయిలో దిగుబడి చేతికందుతుందో లేదోనన్న భయం ఉంది.ఽ ఎరువుల ధరలు పెరగడం, కూలీల కొరతతో పెట్టుబడి గతంలో కన్నా ఎకరాకు రూ.10 వేలు పెరిగింది. ఎకరాకు రూ.30 వేల వరకు వెచ్చించాం.
– కడియాల నర్సింహులు, రైతు, అమరచింత
కోత యంత్రాల కొరత..
పంట కోతలకు యంత్రాల కొరత అధికంగా వేధిస్తోంది. యంత్రాలకు డిమాండ్ ఉండటంతో యజమానులు అద్దె సైతం పెంచారు. గంటకు రూ.2,500, ట్రాక్టర్ అద్దె ట్రిప్పునకు రూ.600 చొప్పున వసూలు చేస్తుండటంతో ఈసారి కోత ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది.
– కృష్ణారెడ్డి, రైతు, అమరచింత
●
							ఖర్చులు పెరిగాయి..

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
