కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం

Sep 12 2025 7:00 AM | Updated on Sep 12 2025 7:00 AM

కలాని

కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం

కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం జర్నలిజంపై దాడి సరికాదు ప్రతిపక్ష పాత్ర పోషించాలి..

ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో పత్రికలపై అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవాలనుకోవడం సిగ్గుమాలిన చర్య. 30 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకొనే చంద్రబాబు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్‌ పిల్లర్‌గా నిలిచి.. ప్రజాగొంతుకను వినిపించే పత్రికలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించడం కలానికి సంకెళ్లు వేయడమే. దీనిని ప్రతిఒక్క ప్రజాస్వామికవాది ఖండించాలి. ఇప్పటికై నా చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలి.

– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్‌ ఎస్టేట్‌గా గుర్తింపు ఉన్న జర్నలిజంపై దాడి సరికాదు. ప్రజల పక్షాన గళం విప్పే పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రధానమైనది. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడం సరికాదు. పత్రికలలో వచ్చిన వార్తలు అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్ప అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. జర్నలిజం విలువల పరిరక్షణకు ప్రభుత్వాలు పాటుపడాలి. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్‌పై అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది.

– అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల

జర్నలిస్టులు ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏపీలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసులు నమోదు చేయడం వంటివి పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ ఎడిషన్‌ సెంటర్లపై దాడులు, ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య. పోలీసులు కూడా కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేయడం తగదు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే కచ్చితంగా జర్నలిస్టులు ప్రజల తరపున ప్రశ్నించడం సహజం. ఎడిటర్‌ స్థాయి వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం దారుణం. ఏకంగా జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం, పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు.

– చంద్రశేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు,

టీయూడబ్ల్యూజే (హెచ్‌–143), నాగర్‌కర్నూల్‌

కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం 
1
1/2

కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం

కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం 
2
2/2

కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement