
అప్రజాస్వామ్యం..
పత్రికల గొంతు నొక్కడం
● సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై
కేసులు నమోదు చేయడం సరికాదు
● మీడియాపై అణచివేత విధానాలను ఖండించిన పాత్రికేయ సంఘాలు, రాజకీయ నాయకులు
●
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ప్రతిపక్షాలు మాట్లాడలేనప్పుడు ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకొస్తాయి. అలాంటి పత్రికలు, మీడియాపై అణచివేతకు దిగడం.. కేసులు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇప్పుడు ఒకరు అనైతిక చర్యలకు దిగారంటే.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ పోతే అభివృద్ధి కుంటుపడడమే కాకుండా రాష్ట్రం రావణకాష్టగా మారుతుంది. రాజకీయాల మాటున కక్షసాధింపు మంచిది కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికై నా పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. – శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్‌నగర్