
సమన్వయంతో మెలగాలి..
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం, జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామిక చర్య. భావ ప్రకటనను ఎవరైనా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడకుండా.. సమన్వయంతో మెలిగేందుకు ప్రయత్నించాలి. పత్రికలు, జర్నలిస్టులపై దాడులు, కేసులు నమోదు సరికాదు.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, దేవరకద్ర
‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది. అభిప్రాయాలను పంచుకునేందుకు, ప్రభుత్వానికి ప్రజల వాణిని వినిపించడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికలపై, సంపాదకులపై పనిగట్టుకొని కేసులు నమోదు చేయడం దారుణం. పత్రికలు తమ పని తాము స్వేచ్ఛగా చేసినప్పుడే సమాజంలోని అన్నివర్గాల అభిప్రాయాలు ప్రజలకు చేరువవుతాయి. – వి.నరేందర్‌చారి,
ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్

సమన్వయంతో మెలగాలి..