
అన్నదాతల ఆనందం
298 ఎకరాల భూ సేకరణ..
‘సింగోటం–గోపల్‌దిన్నె’ లింక్ కెనాల్ పనులు పునః ప్రారంభం
–8లో u
●
భీమా కాల్వ ఫేజ్–2కు ఈ కాల్వను లింక్ చేయడంతో వందలాది ఎకరాలు సాగులోకి వస్తుంది. మా కుటుంబానికి సంబంధించి 10 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మంత్రి జూపల్లి చొరవచూపి భీమా కాల్వకు కూడా ఈ లింక్ కెనాల్ ద్వారా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలి.
– తలకంటి వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, వీపనగండ్ల
కాల్వ నిర్మాణంతో పలువురు పేద రైతులు భూములు కోల్పోవాల్సి వస్తోంది. మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.20 లక్షలు చెల్లిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక జీఓ తీసుకొచ్చి రైతులకు సరైన పరిహారం అందించాలి.
– బాల్‌రెడ్డి,
సీపీఎం మండల కార్యదర్శి, వీపనగండ్ల
భూ సేకరణకు రైతులు సహకరిస్తే లింక్ కెనాల్ పనులు త్వరగా పూర్తవుతుంది. కాల్వ నిర్మాణం జరిగితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. గ్రామాల్లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు రైతులను సమన్వయపర్చి భూములు ఇచ్చేందుకు సహకరించాలి.
– ఆసీఫ్, డిప్యూటీ తహసీల్దార్ (భూ సేకరణ)
వీపనగండ్ల: మండలంతో పాటు ఇతర మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించే సింగోటం–గోపల్‌దిన్నె లింక్ కెనాల్ పనులు పునః ప్రారంభం కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో పనులు ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇటీవలే రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లింక్ కెనాల్ పనులను తిరిగి ప్రారంభించేందుకు భూమి పూజ చేసి భూ సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మూడు మండలాలకు ప్రయోజనం..
లింక్ కెనాల్ నిర్మాణంతో వీపనగండ్ల మండలం తూంకుంట, వీపనగండ్ల, గోపల్‌దిన్నె, సంపట్రావుపల్లి, చిన్నంబావి మండలంలోని వెలగొండ, దగడపల్లి, కొప్పునూరు, పెద్దమారూర్, కాలూరు, చెల్లపాడుతో పాటు పెంట్లవెల్లి మండలంలో కొండూరు, గోపాలాపురం, సింగవరం తదితర గ్రామాల రైతులకు రెండు పంటలకు సాగునీరు అందుతుంది. దీంతో ఆయా గ్రామాల్లోని రైతులు, ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపట్టాలని ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో నాటి కాంట్రాక్టర్ రూ.147 కోట్లతో కాల్వ పనులు ప్రారంభించి వల్లభాపురం సమీపంలో వంతెన, కొంతమేర కాల్వ నిర్మాణం చేపట్టినా.. మారిన రాజకీయ పరిస్థితులతో అర్ధాంతరంగా నిలిపివేశారు. నేడు మంత్రి జూపల్లి చొరవతో పనులు తిరిగి ప్రారంభించి ఆర్నెల్లలో పూర్తిచేసి సాగునీరు అందిస్తామని చెబుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల సర్వే కోసం ఓ రైతు పొలంలో పాతిన జెండా
నిర్మాణం పూర్తయితే
45 వేల ఎకరాలకు సాగు నీరు
మూడు మండలాల రైతులకు తీరనున్న కష్టాలు
భూ సేకరణపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతున్న రైతులు
లింక్ కెనాల్ నిర్మాణానికి 298 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇందులో కల్వరాలలో 52.26 ఎకరాలు, బొల్లారంలో 73.13, వల్లభాపురంలో 87.03, తెల్లరాళ్లపల్లిలో 3.16, సంగినేనిపల్లిలో 82.02 ఎకరాల భూ సేకరణకు వనపర్తి ఆర్డీఓ, భూ సేకరణ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తూ కాల్వ నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నారు.

అన్నదాతల ఆనందం

అన్నదాతల ఆనందం

అన్నదాతల ఆనందం