
సద్వినియోగం చేసుకోవాలి..
కోర్టుల్లోని పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. కక్షిదారులకు రెండు పద్ధతుల్లో మేలు చేకూరుతుంది. లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసులు పై కోర్టులకు వెళ్లినా చెల్లుబాటు కావు. ఇరువురి అభిప్రాయంతోనే తుది తీర్పు వెలువరుస్తాం. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకునేందుకు ఇద్దరి మధ్య పరిపూర్ణమైన అవగాహన కుదురుతుంది. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారమైతే కోర్టు ఫీజు వాపస్ ఇవ్వబడుతుంది. – వి.రజని, కార్యదర్శి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ
●