
జూరాలపై వెలుగులేవి?
ప్రాజెక్టు రహదారిపై వెలగని విద్యుద్దీపాలు
–8లో u
●
అధికారుల నిర్లక్ష్యం..
జూరాల ప్రాజెక్టుపై విద్యుద్దీపాల ఏర్పాటు సమస్యను అధికారులు నేటికీ పరిష్కరించడం లేదు. తాగు, సాగునీటితో పాటు విద్యుదుత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టుపై అంధకారం నెలకొంది. రాత్రిళ్లు వెలుతురు ఉండేలా విద్యుద్ధీపాలు ఏర్పాటు చేయాలి.
– విష్ణువర్ధన్ యాదవ్, అమరచింత
నిధులు మంజూరయ్యాయి..
జూరాల ప్రాజెక్టు రహదారిపై విద్యుద్దీపాల ఏర్పాటుకు రూ.18 లక్షలు మంజూరయ్యాయి. వీటితో పూర్తిస్థాయిలో విద్యుత్ బల్బులు బిగించేందుకు కార్యాచరణ రూపొందించాం. సంబంధిత పనులను కాంట్రాక్టర్‌కు అప్పజెప్పాం. డ్యాంపై రాత్రిళ్లు చీకటి లేకుండా చర్యలు తీసుకుంటాం.
– జుబేర్ అహ్మద్, ఈఈ, గద్వాల
ఏళ్లుగా తీరని సమస్య..
ప్రాజెక్టు రహదారిపై విద్యుద్దీపాలు ఏళ్ల తరబడి వెలగకున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యను పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. రాత్రిళ్లు రహదారిపై ప్రయాణం చేయాలంటే భయపడుతున్నాం.
– వెంకటేష్, నందిమళ్ల (అమరచింత)
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయంపై రాత్రిళ్లు వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ఏళ్లు గడుస్తున్నా మరమ్మతుకు నోచుకోవడం లేదు. దీంతో ప్రాజెక్టు రహదారి రాత్రి సమయంలో చీకట్లు కమ్ముకొని వాహనదారులు, ప్రయాణికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక ప్రజలు ప్రాజెక్టు రహదారి మీదుగా తమ తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సమస్యను పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
గుంతలమయంగా మారిన రహదారి..
ప్రాజెక్టు రహదారిపై అడుగడుగునా గుంతలపడి అధ్వానంగా మారింది. అమరచింత మండలం నందిమళ్ల పీజేపీ క్యాంపు సమీపంలోని సత్యసాయి తాగునీటి పథకం నుంచి ప్రారంభమైన ప్రాజెక్టు రహదారి జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం చింతరేవుల వరకు సుమారు 5 కిలోమీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతింది. రహదారి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాల్సి ఉన్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలే గుంతల రహదారి.. ఆపై రాత్రిళ్లు చీకట్లు అలుముకొని ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. రహదారి మరమ్మతుకు సైతం నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సైతం పంపలేని స్థితిలో అధికారులు ఉన్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఏళ్లు గడుస్తున్నా..
మరమ్మతుకు నోచుకోని వైనం
ప్రమాదాలకు నిలయంగా
మారిన రహదారి
పట్టించుకోని అధికారులు
నిధులు మంజూరైనా.. ముందుకు సాగని పనులు
రూ.18 లక్షలు మంజూరైనా..
జూరాల ప్రాజెక్టు రహదారిపై విద్యుద్దీపాల ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపడంతో రూ.18 లక్షలు మంజూరైనట్లు పీజేపీ అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ నేటికీ మరమ్మతుల్లో మాత్రం వేగం కనిపించడం లేదు.

జూరాలపై వెలుగులేవి?

జూరాలపై వెలుగులేవి?

జూరాలపై వెలుగులేవి?