
‘స్వయం ఉపాధి’పై అవగాహన
పాన్‌గల్: మండలంలోని మల్లాయిపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మహిళా రైతులు, గ్రామీణ యువతకు సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి, వ్యాపార రంగాలపై శనివారం శాస్త్రవేత్త డా. భవాని అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత, మహిళా రైతులు శాసీ్త్రయ సాంకేతికతను వినియోగించుకోవడంతో పాటు ఆధునిక పద్ధతులను పాటిస్తూ అధిక లాభాలు పొందడం అనే అంశాల గురించి వివరించారు. మహిళలు, గ్రామీణ యువత అందుబాటులో ఉన్న శిక్షణ కార్యక్రమాలు, సూక్ష్మ వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం అనే అంశాలపై రెసెటి ప్రతినిధి చరణ్‌కుమార్ వివరించారు. మహిళా రైతులు వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, రాయితీలు పొందడం అనే అంశాలపై పీఎంఎఫ్‌ఎంఈ ప్రతినిధి రవిసాగర్ తెలియజేశారు. ఐకేపీ ఏపీఎం వెంకటేష్‌యాదవ్, వీఓఏలు, మహిళ రైతులు పాల్గొన్నారు.