
యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం : బీజేపీ
వనపర్తిటౌన్: కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు తప్పవని సేవాపక్షం రాష్ట్ర కో–కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అధ్యక్షతన వర్క్‌షాప్ నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ఓ పక్క మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే.. రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గిస్తామని ఇచ్చిన మాట ప్రకారం నాలుగు స్లాబ్‌లను రెండు స్లాబ్‌లుగా చేసిందని కొనియాడారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం–2025 పేరుతో రక్తదానాలు, మండలస్థాయి కార్యశాలలు, విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, స్వచ్ఛభారత్, డాక్యుమెంటరీ ప్రదర్శన, దివ్యాంగులకు సన్మానం, ఉపకరణాల పంపిణీ, ప్రభుత్వ అవార్డులు పొందిన వ్యక్తుల సన్మానం, మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహద్దూర్ శాస్త్రి చిత్రపటాలకు పుష్పాంజలి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి శ్రీశైలం. స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ మెంటేపల్లి పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు హేమారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పెద్దిరాజు, వారణాసి కల్పన, అక్కల రామన్‌గౌడ్, సుమిత్రమ్మ, రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, పి.విష్ణువర్ధన్‌రెడ్డి, కదిరె మధు, బాశెట్టి శ్రీను, శివారెడ్డి, రాఘవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.