
సాధించిన పతకాలు..
వనజారెడ్డి 2007 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు జాతీయ, రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అదిలాబాద్ (బాసర)లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో రజతం, 2016లో కర్ణాటక (ఉడిపి)లో జరిగిన జాతీయస్థాయి యోగాలో బంగారు పతకం సాధించింది. అదే ఏడాది వైజాగ్లో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్లో యోగాలో రజతం పొందింది. 2017 జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ యోగా విభాగంలో బంగారు పతకం సాధించింది. 2018 పంజాబ్ రాష్ట్రం పటియాలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో రజత పతకం సాధించారు. 2023 ఏపీ రాష్ట్రం తాడేపల్లిగూడెంలో జరిగిన యోగా పోటీల్లో, 2024లో పలుచోట్ల జరిగిన రాష్ట్ర, జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంది. సిద్దిపేటలో యోగాసన క్రీడా సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి సూర్య నమస్కారాల పోటీల్లో వనజారెడ్డి ప్రతిభచాటి ప్రథమస్థానంలో నిలిచారు. అదేవిధంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని పతకాలు సాధిస్తూ ప్రతిభచాటుతున్నారు.
వనజారెడ్డి, కీర్తనారెడ్డి యోగా విన్యాసాలు