ఎస్సీ నిరుద్యోగ యువతకు అవగాహన మేళాలు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ నిరుద్యోగ యువతకు అవగాహన మేళాలు

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

ఎస్సీ నిరుద్యోగ యువతకు అవగాహన మేళాలు నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆశలన్నీ.. వరుణుడిపైనే... ● మడ్డువలస ప్రాజెక్టులో అరకొరగా నీటి నిల్వలు

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక అవగాహన మేళాలు నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ కార్యనిర్వహక సంచాలకులు (ఈడీ) వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జిల్లాలో ‘ప్రధాన మంత్రి అనుసూచిత్‌ అభ్యుదయ యోజన’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి, జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీ ఖాదీ బోర్డు, ఐటీఐ, వివిధ శిక్షణా భాగస్వాములు, కుటీర, హస్తకళల పరిశ్రమల సంఘాలు, బ్యాంకులు, ‘పీఎం అజయ్‌’ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కో–కంపోనెంట్‌ కింద గుర్తింపు పొందిన ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీల సమన్వయంతో ఈ మేళాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేళాల ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు ఇంటర్న్‌షిప్‌, ఉపాధిని కోరుకునే ఎస్సీ యువతకు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌, కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి అవకాశాలు, స్వయం ఉపాధి, వివిధ రకాల వ్యాపార పథకాలపై నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఈ నెల 16న విజయనగరం వీటీ అగ్రహారంలోని టీటీడీసీ మహిళా ప్రాంగణం, 17న బొబ్బిలిలోని మండల పరి షత్‌ అభివృద్ధ్ది మహిళా ప్రాంగణంలో అవగా హన మేళాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

విజయనగరం అర్బన్‌: జిల్లా ప్రజల సమస్యల ను త్వరితగతిన పరిష్కరించేందుకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ సోమవారం నిర్వహించనున్నట్టు కలెక్ట ర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అర్జీదారు లు దరఖాస్తుల్లో పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ వంటి పూర్తి వివరాలను స్పష్టంగా నమో దు చేయాలని, సమస్యకు సంబంధించిన ఆధారాలను జతపరచాలని సూచించారు. కలెక్టరే ట్‌కు రాలేని వారు 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా లేదా ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యా దు చేయవచ్చని తెలిపారు. కలెక్టరేట్‌కు రాలేని వారు మండల, మున్సి పల్‌ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ‘రెవెన్యూ క్లినిక్‌’ నిర్వహిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఇందులో తహసీల్దార్లు, ఆర్‌డీఓలు పాల్గొంటారని పేర్కొన్నారు. రైతులు తమ భూ వివాదాలు, మ్యుటేషన్‌లు, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు.

వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆశాజనకంగా లే వు. వర్షాలుపైనే నీటి నిల్వ ఆధారపడి ఉంది. ఈ నెల ఆరంభంలో స్వల్పంగా వర్షపాతం నమోదు కావడంతో ప్రాజెక్టులో అనుకున్న స్థాయిలో నీటి నిల్వలు లేవు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు మడ్డువలస కుడి, ఎడమ కాలు వల నుంచి సాగునీటి విడుదల మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ప్రాజెక్టులో నీటి నిల్వలు ఇలా..

మడ్డువలస ప్రాజెక్టులో 65 మీటర్లు లెవెల్‌ కెపాసిటీ నీటి మట్టం ఉండాల్సి ఉంది. ప్రస్తుతం 62.19 మీటర్లు లెవెల్‌ నీటిమట్టం ఉంది. ఈ లెక్కన 1.22 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉంది. ప్రాజెక్టు పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో 31వేల ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. వీటన్నింటికీ సాగు నీరందించాలంటే సుమారు రెండు టీఎంసీల నీరు తక్షణ అవసరం. ప్రస్తుతం నీటినిల్వ తక్కువగా ఉండడంతో మరో 15 రోజులు నీటి సరఫరాలో ఆలస్యం ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ భాగంలో వర్షాలు తక్కువగా ఉండడంతో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా లేదు. వర్షాలు కురిస్తే తప్ప నీటి లభ్యతకు ఆస్కారం లేదు. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు వర్షాలపైనే తమ ఆశలు పెంచుకుంటున్నారు. వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement