పిడుగుపాటుతో పాడి గేదె మృతి, పశువుల శాల దగ్ధం | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో పాడి గేదె మృతి, పశువుల శాల దగ్ధం

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

కొత్తవలస: మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పెద్ద పెద్ద ఉరుములుతో కూడిన వర్షం కురవగా పిడుగుపడడంతో మండలంలోని చీపురువలస గ్రామానికి చెందిన ఉల్లి అక్కమ్మ పాడిగేదె మృతి చెందింది. గేదె సుమారు రూ 70వేలకు పైగా ఉంటుందని జీవనాధారమైన గేదె మృతి చెందడంతో అక్కమ్మ లబోదిబో మంటూ రోదించింది.అలాగే వర్షం మరికొద్ది సమయంలో కురుస్తుందన్నప్పుడు పడిన భారీ పిడుగుకు తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేట గ్రామం సమీపంలో పొలమరశెట్టి పద్మజ్యోతికి చెందిన పశువుల పాక దగ్ధమైంది. ఆ సమయంలో పాకలో ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement