బొబ్బిలి/గజపతినగరం :
చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో బొబ్బిలి, గజపతినగరంలో రౌండ్ టేబుల్ సమావేశాలు మంగళవారం నిర్వహించారు. బొబ్బిలిలో జరిగిన సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, నియోజకవర్గ పరిశీలకుడు రొంగలి జగన్నాధం, రాజాం నియోజకవర్గ పరిశీలకుడు కేవీ సూర్యనారాయణ పాల్గొన్నారు. గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితరులు పాల్గొన్నారు.


