ఆరోగ్యంతోనే క్రీడల్లో రాణింపు
● అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్
క్రీడాకారిణి పెద్దిశెట్టి ఉషశ్రీ
డెంకాడ: క్రీడల్లో ఎదగాలంటే ఆరోగ్యం చాలా అవసరమని అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పెద్దిశెట్టి ఉషశ్రీ అన్నారు. జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలలో రెండు రోజుల పాటు జరగనున్న వార్షిక క్రీడా పోటీలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వీటిని షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఉషశ్రీ, వీవీఎస్‌కే లింగేశ్వరరావులు మాట్లాడారు. విజయం సాధించాలంటే పట్టుదల, క్రమశిక్షణ ప్రధానమన్నారు. క్రీడా సంస్కృతికి వ్యక్తుల సమగ్రాభివృద్ధికి దోహదపడతాయని వివరించారు. జీవితంలో అన్ని రంగాల్లో విజేతలుగా నిలబడేందుకు దోహపడుతుందని చెప్పారు.
కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కె.శివరామకృష్ణ, వైస్ చైర్మన్ పి.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీ రామారెడ్డి, వైస్ ప్రిన్సిపాళ్లు తమ్మినేని హరిబాబు, వి.అంజిరెడ్డి, డీన్‌లు, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు ఎంవీ రజినీకాంత్, సంతోష్, విద్యార్థులు పాల్గొన్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్‌తో పాటు ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్స్ వంటి పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. తొలి రోజు పోటీలు అతిథుల ప్రారంభోత్సవాలతో ప్రారంభమయ్యాయి. అనంతరం పరేడ్ నిర్వహించారు.


