వైద్య కళాశాల భవనాలను త్వరితగతిన పూర్తి చేయండి
● నాబార్డు జనరల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ బోధనాస్పత్రి భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని నాబార్డు జనరల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్ అధికారులకు సూచించారు. గాజులరేగ వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఆయన గురువారం పరిశీలించారు. భవన నిర్మాణాలు పూర్తిచేయడంతో పాటు ఎక్విప్‌మెంట్‌ను సకాలంలో సమకూర్చాలన్నారు. చంపావతి నది నీటిని ఇంతవరకు వైద్య కళాశాలకు మళ్లించలేదని కళాశాల అధికారులు నాబార్డు జీఎం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని ఏపీఎంస్‌ఐడీసీ అధికారులకు ఆయన సూచించారు. సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ బి.దేవి మాధవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సరోజని, ఏఓ నారాయణమూర్తి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ భారతి, తదితరులు పాల్గొన్నారు.


