‘ప్లీట్‌’ స్టాంప్స్‌ ప్రత్యేకం | - | Sakshi
Sakshi News home page

‘ప్లీట్‌’ స్టాంప్స్‌ ప్రత్యేకం

Feb 20 2026 6:26 AM | Updated on Feb 20 2026 6:26 AM

‘ప్లీ

‘ప్లీట్‌’ స్టాంప్స్‌ ప్రత్యేకం

‘ప్లీట్‌’ స్టాంప్స్‌ ప్రత్యేకం

లక్కవరపుకోట: అంతర్జాతీయ యుద్ద నౌకల సమీక్ష (ప్లీట్‌ రివ్యూ) మనదేశంలోని విశాఖపట్నంలో నిర్వహించడం ఓ అద్భుతం. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాల గౌరవార్ధం పోస్టల్‌ శాఖ స్టాంపులు, కవర్లు విడుదల చేయడం ఆనవాయితీ. ఇప్పటి వరకు మన దేశంలో జరిగిన ప్లీట్‌ రివ్యూల సమయంలో విడుదల చేసిన అరుదైన స్టాంపులు, కవర్లను మండలంలోని కళ్లేపల్లి – రేగ గ్రామనికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కందాల రామకృష్ణారావు సేకరించారు. ఆయన వద్ద 2001లో ముంబయిలో జరిగిన ప్లీట్‌ రివ్యూ నుంచి 2016లో విశాఖపట్నంలో నిర్వహించిన యుద్ధ నౌకల సమీక్షల సమయాల్లో విడుదల చేసిన స్టాంపులు, కవర్లు ఉన్నాయి. ఆయన సేకరించిన పలు రకాల స్టాంపులు, నాణేలు, పురాతన పత్రికలను పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటి గురించి విద్యార్థులకు తెలియజేస్తూ చైతన్యపరుస్తున్నారు. మనదేశ చరిత్ర, సంస్కృతి, గొప్పతనాన్ని యువతకు తెలియజేసేందుకే అలనాటి నాణేలు, స్టాంపులను సేకరించి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

‘ప్లీట్‌’ స్టాంప్స్‌ ప్రత్యేకం1
1/3

‘ప్లీట్‌’ స్టాంప్స్‌ ప్రత్యేకం

‘ప్లీట్‌’ స్టాంప్స్‌ ప్రత్యేకం2
2/3

‘ప్లీట్‌’ స్టాంప్స్‌ ప్రత్యేకం

‘ప్లీట్‌’ స్టాంప్స్‌ ప్రత్యేకం3
3/3

‘ప్లీట్‌’ స్టాంప్స్‌ ప్రత్యేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement