ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే భక్తుల మృతి
● కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయ ఘటనపై వైఎస్సార్‌సీపీ నిరసన ● మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ
విజయనగరం:
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావ ణి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వడమే తప్ప ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటనలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం వైఫల్యాలను నిరసిస్తూ ఘటనలో మృతి చెంది న వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన ఆదివారం రాత్రి నిర్వహించా రు. జిల్లా కేంద్రంలోని కోట జంక్షన్ నుంచి పైడితల్లి అమ్మవారి ఆలయం చదురుగుడి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా నగర మేయర్, డిప్యూటీ మేయర్‌లు మాట్లాడుతూ ప్రజల ప్రాణా లంటే కూటమి ప్రభుత్వానికి లెక్క లేకుండా పోతు ందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతి, సింహాచలం ఘటనల్లో పలువురు భక్తులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకొని తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే ఘోరంగా విఫలం చెందారని, ఫలితంగానే 9 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో భక్తులు గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. ఇటువంటి దుర్ఘటనలు మరలా పునరావృతం కాకుండా తగిన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్, జిల్లా పెన్షనర్లు, ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డోల మన్మధకుమార్, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు కెల్ల త్రినాధ్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, పలువురు కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


