సంబరపడ్డా.. ఇంతలోనే...
ఈ చిత్రంలో రాలిపోయిన టమాట కాయలు చూపిస్తున్న రైతు రామభద్రపురం మండలం కొండ కెగువ గ్రామానికి చెందిన బెల్లాన బంగారునాయు డు. ఇతను సుమారు రూ.లక్షా 50 వేలు పెట్టుబడి పెట్టి ఎకరన్నర విస్తీర్ణంలో టమాట పంట సాగు చేస్తున్నాడు. పంట బాగుందన్న అనుకుని సంబరపడ్డాడు. ప్రస్తుతం కోత దశలో మోంథా తుఫాన్ ఆశలపై నీళ్లు చల్లింది. భారీ వర్షాలు కారణంగా తోటకు పూర్తిగా తెగుళ్లు సోకి కాయలపై మచ్చలు వచ్చి కాయ రాలిపోతుందని వాపోయాడు. అలాగే నాణ్యత తగ్గి దిగుబడి కూడా రాలేదని కన్నీరు మున్నీరు అవుతున్నాడు. పెట్టుబడి అయినా వస్తుందో.. లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


