విజయనగరం
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఈ చిత్రంలో కనిపిస్తూ టమాట మొక్కలు చూపిస్తున్న రైతు.. రామభద్రపురం మండల కేంద్రానికి చెందిన ఎరుసు విజయానందరెడ్డి. తనకున్న మూడు ఎకరాల పొలంలో రెండు ఎకరాలలో సుమారు రూ.2 లక్షల 50 వేలు పెట్టుబడి పెట్టి మల్చింగ్ పద్ధతిలో పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది పంట ఏపుగా పెరిగిందనుకున్నాడు. ఇంత లో మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తోటలో పూత, పిందె రాలిపోయి మొక్క లు ఉట్టిపోయాయి. కొన్ని మొక్కలు చనిపోతున్నా యి. మొక్కలను బతికించుకునేందుకు అప్పులు చేసి మందులు చల్లుతున్నాడు. గత ప్రభుత్వంలో టమాట తోటకు సాగు చేసిన రైతులకు విత్తన, ప్లాస్టిక్ కవరు, కంప బిల్లు పెడితే ఎంతో కొంత డబ్బులు వచ్చేవి. ఇప్పుడు గతేడాది బిల్లులు పెట్టినా కనీసం రూపాయి రాలేదు. ఇప్పుడు ఈ నష్టం తలచుకుంటూ కుంగిపోతున్నాడు.


